త్వరలోనే.. సల్మాన్ సినిమా షూటింగ్లో రష్మిక?

praveen
సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన్న గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం తన నటనతో తన సినిమాల తో వరుసగా సూపర్ హిట్లు అందుకుంటూ అందరికీ సుపరిచితురాలుగా మారి పోయింది ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ అనే గుర్తింపును సంపాదించుకొని కుర్ర కారు అందరికీ కూడా ఫేవరెట్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది అని చెప్పాలి.

 తెలుగు చిత్ర పరిశ్రమ లోకి చలో అనే ఒక చిన్న సినిమా  తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు పుష్ప సూపర్ హిట్ తో పాన్ ఇండియా రేంజ్ ని సంపాదించింది.  కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకేక్కుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలకు సైన్ చేసిన రష్మిక మందన్న ఇక ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ మూవీ లో కూడా నటించబోతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే మూవీ తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాని చెప్పింది రష్మిక మందన్న. త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సికిందర్ మూవీ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నా అంటూ చెప్పింది. మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంఫై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది రంజాన్ కు  ఈ మూవీ ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది రష్మిక. ఈ అమ్మడికి అదృష్టం ఎలా కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: