తన నెక్స్ట్ సినిమా అలా ప్లాన్ చేస్తున్న చైతు.. పాన్ ఇండియా ప్లాన్ అదిరిందిగా..!?

Anilkumar
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీత ఆర్ట్స్ టు బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా కంటే ముందు వరకు వరుసగా ఫ్లాప్ లను అందుకుంటున్న నాగచైతన్య కి ఈ సినిమా ఒక మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నాగచైతన్య తను తదుపరి సినిమాని కార్తీక్ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కార్తిక్ దండు

 నాగచైతన్యతో మరోసారి ఇదే తరహాలో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే విరూపాక్ష సినిమా విడుదలైన తర్వాత దానికి సీక్వెల్ ఉండబోతుందని అన్నారు. కానీ దానిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఇకపోతే కార్తీక్ దండు.తో నాగచైతన్య చేయబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే ఇప్పటివరకు నాగచైతన్య ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా

 చేయలేదు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా కార్తీక్ దండు.తో చేసే సినిమా సైతం పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతున్నట్లుగా సమాచారం... నాగ చైతన్య తండేల్ తర్వాత సినిమా కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించేందుకు వస్తుంది. కార్తీక్ దండు నాగ చైతన్య సినిమాకు సుకుమార్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుదని తెలుస్తుంది. కార్తీక్ చేసిన విరూపాక్ష సినిమాకు కూడా సుకుమార్ తన సపోర్ట్ అందించాడు. అందుకే చైతు సినిమాకు కూడా తన గురువు సుకుమార్ హెల్ప్ తీసుకుంటున్నాడు కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: