విజయ్ సేతుపతి: తెలుగు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతున్నాడుగా?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన మూవీ మహారాజ. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా థియేటర్స్ లోకి వచ్చిన మహారాజ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో మౌత్ టాక్ కూడా పెరిగి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. విజయ్ సేతుపతికి హీరోగా తెలుగులో ఫస్ట్ సక్సెస్ పిజ్జా మూవీతో వచ్చింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. అయితే ఏ ఒక్కటి కూడా మెప్పించలేదు. మళ్ళీ చాలా కాలం తర్వాత మహారాజ మూవీతో తెలుగులో సూపర్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు.పైగా పబ్లిక్ నుంచి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. జూన్ 14 వ తేదీన రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయాయి. 


అయితే మహారాజ సినిమా మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. అటు తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియాలో రెండో రోజు మహారాజ సినిమాకి ఏకంగా 2 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. మూడో రోజు కొద్దిగా పెరిగి ఏకంగా 2 లక్షల 7 వేల టికెట్లు అమ్ముడు కావడం విశేషం. ఇక నాలుగో రోజు కూడా ఆ ఇంపాక్ట్ కనిపించింది.దీనిని బట్టి ఈ సినిమా పబ్లిక్ ని ఏ స్థాయిలో ఎట్రాక్ట్ చేస్తుందో పూర్తిగా అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో  5.95 కోట్ల గ్రాస్ ని మహారాజ మూవీ అందుకుంది. ఇక షేర్ కలెక్షన్స్ విషయానికి వస్తే 2.95 కోట్లు. నైజాంలో 1.42 కోట్లు, ఆంధ్రాలో 1.05 కోట్లు ఇంకా సీడెడ్ లో 48 కోట్ల గ్రాస్ ని మహారాజ ఇప్పటి దాకా అందుకుంది. సోమవారం కూడ బక్రీద్ సెలవు రావడంతో కలెక్షన్స్ మరింతగా పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.మొత్తం 3.55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మహారాజ మూవీ రిలీజ్ అయ్యింది. మైత్రీ శశి ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. కచ్చితంగా ఈ మూవీతో మంచి లాభాలని సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: