
సందీప్ రెడ్డి బిగ్ ప్లాన్.. స్పిరిట్ లో ప్రభాస్ విలన్ ఎవరో తెలుసా?
అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే. కాగా కల్కి సినిమా షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇక ఇప్పుడు మరో మూవీ కోసం రెడీ అవుతున్నాడు. అయితే తన సినిమాలతో ఎప్పుడు సెన్సేషన్ సృష్టించే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి కాగా ఈ మూవీలో ఏకంగా ప్రభాస్ ని ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఒక పవర్ఫుల్ నటుడుని బరిలోకి దింపాలని అనుకుంటున్నాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఏకంగా బాలీవుడ్ ఖిలాడీని రంగంలోకి దింపుతున్నాడు అన్నది తెలుస్తుంది.
అవును మీరు విన్నది నిజమే.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అటు ప్రభాస్ను ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే నెగిటివ్ క్యారెక్టర్స్ వేయడం అక్షయ్ కు కొత్తేమి కాదు. గతంలో రోబో 2.0 సినిమాలో రజనీకాంత్ కు దీటుగా పక్షిరాజు పాత్రలో అక్షయ్ తన నటనతో అదరగొట్టేసాడు. ఇక సందీప్ రెడ్డి సినిమాలలో విలన్ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న యానిమల్ మూవీలో బాబి డియోల్ విలన్ పాత్ర పోషించడంతో అతని కెరియర్ కు ఎంతో బూస్టప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రను ఎలా ప్లాన్ చేయబోతున్నాడో చూడాలి మరి.