"ఓజి" పై వస్తున్న ఆ వార్తలు అన్నీ ఫేక్... షాక్ లో పవన్ ఫ్యాన్స్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే టాలీవుడ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత చాలా రోజులు సూపర్ స్పీడ్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతూ వచ్చింది.

అలాంటి సమయం లోనే ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల హడా విడి మొదలు కావడంతో పవన్ అటు వైపు అడుగులు వేశాడు. అందులో భాగంగా చాలా నెలల నుండి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే పవన్ ఈ సినిమా షూటింగ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఓజి మూవీ యొక్క నాన్ థియేటర్ హక్కులు ఏకంగా 90 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి అని ఒక వార్త వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఓజి మూవీ యొక్క నాన్ థియేటర్ హక్కులు 90 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి అని వచ్చిన వార్తలు అన్ని అవాస్తవం అని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి నాన్ థియేటర్ అమ్మకాలు జరగలేదు అని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: