ఆ హీరోయిన్ పెళ్లిలో పాత్రలో కడిగాడు... కట్ చేస్తే బిగ్ స్టార్..!

Pulgam Srinivas
కొంతమంది నటులు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి చిత్రాలలో నటించి ఎంతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. దానితో వారు ఆ తర్వాత మంచి సినిమాల అవకాశాలను అందుకోవడం ఎంతో గొప్ప స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో వారిని చూసిన వారు ఈయన చాలా గొప్ప వ్యక్తి , డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగి ఉంటాడు. అందుకే ఇతనికి మంచి అవకాశాలు వచ్చాయి అని అంతా అనుకుంటారు. 

కానీ కొంత మంది కి మాత్రం ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి గుర్తింపు , మంచి పేరు వచ్చే కంటే ముందు చాలా కష్టాలను అనుభవించిన వారు అనేక మంది ఉంటారు. అలాంటి వారి కష్టాలను ఎవరైనా పక్క వాళ్ళు లేదా వారు చెప్పుకుంటే తప్ప పెద్దగా బయటికి తెలియదు. ఇకపోతే హిందీ లో పంచాయతీ అనే వెబ్ సిరీస్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మూడు సీజన్ లు వచ్చాయి. ఈ మూడు కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సిరీస్ ద్వారా ఆసిఫ్ ఖాన్ అనే నటుడికి మంచి గుర్తింపు లభించింది.

ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... సినిమా ఇండస్ట్రీ కి రాకముందు చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. సైఫ్ అలీ ఖాన్ , కరీనాక పూర్ పెళ్లి జరిగిన హోటల్లో పాత్రలో కూడా కడిగాను. వారితో ఫోటో దిగడానికి వెళితే అనుమతించడానికి వారు నిరాకరించారు. ఆ సంఘటనే తనలో మార్పు ను తీసుకువచ్చిందని , ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక బాలీవుడ్ స్టార్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసినట్లు ఈయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: