మొదటిసారి ఆ విషయంలో క్షమాపణలు కోరిన అనసూయ..!

Pulgam Srinivas
యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టి యాంకరింగ్ రంగంలో మంచి స్థాయికి వెళ్లిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకోవడం అందులో ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినీ పరిశ్రమలో కూడా ఈమె తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక దానితో ఈమె చాలా సంవత్సరాల పాటు ఒక వైపు యాంకరింగ్ రంగంలో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలను కూడా చేస్తూ వచ్చింది.

ఇక ఈమెకు సినిమా అవకాశాలు భారీగా పెరగడం, పక్క ఇండస్ట్రీ నుండి కూడా అవకాశాలు రావడంతో కొంత కాలం యాంకరింగ్ రంగానికి స్వస్తి చెప్పి కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఇకపోతే మళ్లీ ఈమె యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరికొన్ని రోజుల్లో స్టార్ మా చానల్లో ప్రసారం కాబోయే ఓ షో కు ఈమె యాంకర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈమె టీవీ షో లతో , సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ లు పెట్టడం ఎప్పుడూ ఆపలేదు. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం , దానికి ఎవరైనా అసభ్యకరమైన కామెంట్స్ పెట్టినట్లు అయితే వారికి కౌంటర్ ఇవ్వడం కూడా చేస్తూ ఉండేది.

అందులో భాగంగా ఈమె అనేక సార్లు సోషల్ మీడియా వేదికగా కొంత మంది తో గట్టిగా వాగ్వాదానికి దిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ నటి కం యాంకర్ ఓ విషయంలో క్షమాపణలు తెలిపింది. అది ఎందుకు అనుకుంటున్నారా ... తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... ఇన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా సమయాన్ని గడిపాను. దాని వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్ లు చేయలేదు. అలాగే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేను. ఆ విషయంలో నన్ను అభిమానులారా క్షమించండి అని ఈమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇలా అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేనందుకు క్షమాపణలు కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: