మరోసారి ఆ మాస్ హీరో తో సినిమా సెట్ చేసుకున్న సంపత్ నంది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సంపత్ నంది ఒకరు. ఈయన అలా మొదలైంది అనే ఒక లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయనకు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా సినిమాను తెరకెక్కించే అవకాశం వచ్చింది. దానితో ఈయన రచ్చ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు.

ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు మాస్ దర్శకుడుగా గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లకే దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు గోపీచంద్ హీరో గా ఇప్పటికే రెండు సినిమాలను తెరకెక్కించాడు. మొదటగా వీరి కాంబోలో గౌతమ్ నంద అనే సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఈ మూవీ తర్వాత వేరే కాంబోలో సిటీమార్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను సాధించగా సిటీమార్ మూవీ తర్వాత సంపత్ నంది నుండి మూవీనే రాలేదు. ఇక మరోసారి వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు దాదాపు పూర్తి అయినట్లు వీరి కాంబోలో మూవీ ని సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ సంస్థ నిర్మించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sn

సంబంధిత వార్తలు: