మగవాళ్లకు సపోర్టుగా.. హీరోయిన్ రష్మిక పోస్ట్ వైరల్?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన్నకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమై తన నటనతో.. అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టింది. అంతేకాదు తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ అనే గుర్తింపును సంపాదించుకుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరి చూపును కూడా తన వైపుకు తిప్పుకుంది ఈ సొగసరి. ఇక ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ దక్కించుకుని వరుసగా సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు సౌత్ లో వివిధ భాషల్లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈమె.  కాగా ప్రస్తుతం పుష్ప 2 అనే సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అని చెప్పాలి. అయితే ఇటీవల రష్మిక మందన్న మగవారికి సపోర్టుగా చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మగవారు చెడ్డవారు కాదని చాలామంది మంచివారు ఉన్నారు అంటూ రష్మిక మందన వ్యాఖ్యానించింది. ఇంతకీ రష్మిక ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు.

 మగవారిని కించ పరుస్తూ ఒక నేటిజన్ చేసిన పోస్ట్ కి హీరోయిన్ రష్మిక మందన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదు గుర్తుంచుకోండి అంటూ యానిమల్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని నేటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ విషయంపై అటు రష్మిక మందన కూడా స్పందించింది. ఈ క్రమంలోనే మగవారికి మద్దతుగా పోస్ట్ పెట్టింది. మూర్ఖులను నమ్మడం నిజంగా భయానకం. కానీ ఈ లోకంలో చాలామంది మంచి మగవాళ్ళు ఉన్నారు. వారిని నమ్మడం ఎంతో ప్రత్యేకం అంటూ రష్మిక మందన్న ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: