ఇలియానా పై షాకింగ్ కామెంట్ చేసిన స్టార్ డైరెక్టర్..!!

murali krishna
నాజూకు నడుము సుందరి ఇలియానాకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ గోవా సోయగం దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే కొంతకాలం క్రితం వివాహం చేసుకోకుండానే మగ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బాబు పుట్టిన తర్వాత తన లైఫ్ పార్ట్నర్ ఎవరో రివీల్ చేసింది. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అంటూ నెటింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కృష్ణవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానాకు పొగరు ఎక్కువ అంటూ మాట్లాడిన వీడియో నెటింట దుమారంగా మారింది.కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన రాఖీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఇలియాన, చార్మి హీరోయిన్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కృష్ణవంశీ చెబుతూ.. చార్మి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తారని.. కానీ ఆమెకు అన్ని ప్లాప్సే వచ్చాయి అంటూ వివరించాడు. ఇక రాఖీ మూవీ టైంలో ఇలియానా ఆటిట్యూడ్ నాకు అసలు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చిన కృష్ణవంశీ నేన్ను ఆమెను సినిమాల్లో తీసుకోవాలని అసలు అనుకోలేదు.. కానీ అప్పట్లో ఆమెకు మంచి కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి.. దీంతో క్రేజ్ రీత్యా స్టార్ హీరోయిన్గా ఉండడంతో కొంతమంది బలవంతం మేరకు హీరోయిన్గా ఇలియానాను తీసుకువాల్సి వచ్చిందంటూ వివరించాడు.కానీ నాకు మాత్రం ఈ హీరోయిన్‌ను పెట్టుకోవాలని అసలు లేదు. అలాగే సినిమా చేసే టైంలో ఆమె చూపించే ఆటిట్యూడ్ నాకు అసలు నచ్చేది కాదు అంటూ వివరించాడు కృష్ణవంశీ. ఇక ఆమెతో సినిమా టైంలో నేను ఆమెకు కేవలం జస్ట్ డైలాగ్స్ మాత్రమే చెప్పేవాడిని. తర్వాత ఆమె ఎవరో.. నేను ఎవరో.. అసలు తన్ను పట్టించుకునే వాడినే కాదు అంటూ కృష్ణవంశీ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో అంతా షాక్ అవుతున్నారు.ఇలియానా సినిమాల విషయానికోస్తే..ఇలియానా చివరిసారిగా అభిషేక్ బచ్చన్ నటించిన ది బిగ్ బుల్‌లో కనిపించింది. అజయ్ దేవగన్ నిర్మించిన ఈ చిత్రానికి కూకీ గులాటి దర్శకత్వం వహించారు. ఆమె తదుపరి తేరా క్యా హోగా లవ్లీలో రణదీప్ హుడా సరసన నటించనుంది, ఇది మార్చి 8, 2024న థియేటర్లలోకి రానుంది. విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ మరియు సెంధిల్ రామమూర్తితో పాటు ఆమె దో ఔర్ దో ప్యార్ కూడా ఉంది. మార్చి 29న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: