ఆ విషయంలో రష్మిక మందన ను ఫాలో అవుతున్న కీర్తి సురేష్..!!

Anilkumar
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో సైతం వరుస అవకాశాలను దక్కించుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే మొదట బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయినప్పటికీ అనిమల్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ లో వరుస సినిమాలో నటించే అవకాశం దక్కుతోంది. ఇక యానిమల్ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .యానిమల్ సినిమాతో

 బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది రష్మిక మందన. ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది ఈ బ్యూటీ. అయితే ఇప్పటికే చాలామంది టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న వారు బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఒక హీరోయిన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంటే చాలు ఆ హీరోయిన్ బాటలోనే చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నడుస్తున్నారు. కానీ అందరికీ

 అలా కలిసి రావడం లేదు. కానీ రష్మిక మందన లక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే రష్మిక మందనా కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో సైతం  అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. రెండు చోట్ల స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది.  రష్మిక మందన దారిలోనే చాలామంది హీరోయిన్స్ బాలీవుడ్ బాట పట్టారు. ఇక వారిలో ఇప్పుడు కీర్తి సురేష్ సైతం చేరింది .కీర్తి సురేష్ కూడా ఇప్పుడు బాలీవుడ్ సినిమాల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మరి ఈ బ్యూటీ కూడా రష్మిక మందన లాగా బాలీవుడ్ లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ వార్త తెలిసిన తర్వాత కీర్తి సురేష్ అభిమానులు నువ్వు కూడా రష్మిక మందన బాటలోనే నడుస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: