"ఎఫ్ 4" సీక్వెల్ ఇప్పట్లో లేనట్లేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు "ఎఫ్ 2" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

ఆ సమయం లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇలా ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "ఎఫ్ 3" అనే మూవీ ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

దానితో ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజులకే "ఎఫ్ 4" మూవీ కూడా ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. మళ్లీ మధ్యలో కొన్ని రోజులు "ఎఫ్ 4" మూవీ స్టార్ట్ కాబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకు అంటే వెంకటేష్ ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2 సీజన్ 3 షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇక వరుణ్ తేజ్ కూడా వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. అలాగే అనిల్ రావిపూడి కూడా వెంకటేష్ తో మూవీ కాకుండా మరికొన్ని మూవీ లకు కమిట్ అయి ఉన్నాడు. ఇలా అందరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో "ఎఫ్ 4" స్టార్ట్ కావడం కష్టమే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: