ఆ సినిమాకి.. చాలా తక్కువ పారితోషికం తీసుకున్నా : విజయ్ సేతుపతి

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంతో సక్సెస్ తో పాటుగానే అటు ఫేమ్, నేమ్ తో పాటు పారిశుభం కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సక్సెస్ వచ్చింది అంటే చాలు ఇక ఎంతో మంది స్టార్ హీరోలు తమ పారితోషకాన్ని అమాంతం పెంచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు పెంచిన పారితోషకంతో డైరెక్టర్లు నిర్మాతలు కూడా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.

 అయితే కొంతమంది హీరోలు మాత్రం సినిమాను బట్టి పారితోషకం తీసుకుంటూ ఉంటారు. ఇంకొంత మంది హీరోలు చేసింది నిమిషాల పాత్ర అయినప్పటికీ ఇక కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. సాధారణంగా హీరోలు తమ పారితోషకం గురించి ఎక్కడ ఓపెన్ అవ్వరు. ఇలాంటి విషయాలు సీక్రెట్ గానే ఉండాలని అనుకుంటూ ఉంటారు  కానీ కొంతమంది హీరోలు పారితోషకం గురించి అప్పుడప్పుడు ఆసక్తికర విషయం బయటపెడుతూ ఉంటారు. కోలీవుడ్ ప్రేక్షకులందరికీ మక్కల్ సెల్వన్ గా కొనసాగుతూ స్టార్ హీరోగా హవా నడిపిస్తున్న విజయ్ సేతుపతి.. ఇటీవల ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి ఏకంగా విలన్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ సినిమా గురించి ఇటీవల ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోతున్నాయ్. సినిమాల పట్ల డైరెక్టర్ బుచ్చిబాబుకు ఎంతో అభిరుచి ఉందని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు  ఇక ఆ అభిరుచే తనను ఉప్పెన సినిమా చేసేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. సాధారణంగా నాలాంటి నటులు తండ్రి పాత్రలు చేయరు. కానీ బుచ్చిబాబు నన్ను కన్విన్స్ చేశారు. అతడు కథ చెప్పిన విధానం డైలాగ్స్ రాసుకున్న పద్ధతి నాకు బాగా నచ్చాయి. ఆయన కొత్త దర్శకుడు కావడంతో ఉప్పెన సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాను అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో తన కూతురుగా నటించిన హీరోయిన్ కృతి శెట్టితో హీరో గా ఎప్పటికీ నటించబోను అంటూ విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: