"సరిపోదా శనివారం" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , టాలీవుడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ కే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా... జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను జూన్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాలోని మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే జూన్ 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే గతం లో నాని హీరో గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే మూవీ రూపొందింది.

ఈ మూవీ లో నజ్రియా , నాని కి జోడి గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. మరి వీరిద్దరి కాంబో లో పొందుతున్న రెండవ సినిమా అయినటువంటి సరిపోతా శనివారం ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి. నాని ఆఖరుగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: