అఫీషియల్ : "మీర్జాపూర్ 3" స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
ఇండియాలో అత్యంత ప్రజా దరణ పొందిన వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి . ఇప్పటికే మీర్జాపూర్ వెబ్ సిరీస్ నుండి రెండు సీజన్లు వచ్చాయి. మొదటి సీజన్ పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఆ సీజన్ అదిరి పోయే రేంజ్ లో ఉండడంతో మీర్జాపూర్ మొదటి సీజన్ కి ఇండియా వ్యాప్తం గా క్రేజ్ లభించింది . దానితో ఈ సీజన్ కు కొనసాగింపుగా మీర్జాపూర్ సీజన్ 2 ను రూపొందించారు.
 

అప్పటికే మీర్జాపూర్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయి ఉండడం తో ఎప్పుడు మీర్జాపూర్ సీజన్ 2 వస్తుందా..? అని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు . అలా మంచి అంచనాల నడుమ జనాల ముందుకు వచ్చిన మీర్జాపూర్ సీజన్ 2 కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది . ఇక మీర్జాపూర్ సీజన్ 2 పూర్తి అయిన తర్వాత మీర్జాపూర్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందా అని జనాలు చాలా కాలం నుండి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ తేదీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మీర్జాపూర్ సీజన్ 3 సిరీస్ ను జూలై 5 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే మీర్జాపూర్ సీజన్ 1 , 2 ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. మరి ఈ సీజన్ 3 ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: