ఓటిటి రిలీజ్ డేట్ వచ్చినా కూడా సూపర్ హోల్డ్ ను కనబరుస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!
ఈ మూవీ కి 9 రోజుల్లో నైజాం ఏరియాలో 3.35 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.64 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.02 , ఈస్ట్ లో 69 లక్షలు , వెస్ట్ లో 53 లక్షలు , గుంటూరు లో 64 లక్షలు , కృష్ణ లో 54 లక్షలు , నెల్లూరు లో 39 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల షేర్ ... 15.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 9 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.15 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.60 కోట్ల షేర్ , 19.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 40 లక్షల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.