"ఇండియన్ 2" కోసం పెద్ద స్కెచ్ వేసిన శంకర్..?

MADDIBOINA AJAY KUMAR
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ తాజాగా ఇండియన్ 2 అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని శంకర్ , సిద్ధార్థ్ ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఎంతో బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ని జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం మేకర్స్ ఈ మూవీ కి సంబంధించి ప్రచారాలను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మరింత ప్రచారాన్ని జోడించేందుకు మేకర్స్ మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్లాన్ ఏంటి అంటే ఇండియన్ మూవీ చాలా రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో భారతీయుడు అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాని జూన్ 15 వ తేదీన గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా రీ రిలీస్ అయితే ఈ మూవీ ని చాలా వరకు ప్రేక్షకులు థియేటర్ లలో చూస్తారు. అలా చూడడం వల్ల ఇండియన్ 2 మూవీ పై కూడా ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అలా భారతీయుడు మూవీ ని రీ రిలీజ్ చేయడం వల్ల ఇండియన్ 2 మూవీ కి కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఇండియన్ 2 మూవీ కోసం శంకర్ అదిరిపోయే ప్లాన్ వేసినట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: