ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై చివరి సినిమా ఇదే..!

Divya
సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన వారిలో రామోజీరావు కూడా ఒకరు.. రామోజీ ఫిలిం సిటీ, అలాగే ఉషా కిరణ్ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను సైతం నిర్మించారు.ఈ రోజున రామోజీరావు మరణించారు. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి సరికొత్త టెక్నాలజీ వరకు ఎన్నో చిత్రాలను సైతం తెరకెక్కించారు. 1983లో రామోజీరావు స్థాపించిన ఉషాకిరణ్ మూవీస్ పైన ఎంతోమంది ఆర్టిస్టులు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటిసారి శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఉషా కిరణ్ బ్యానర్ మొదలయ్యింది.

అప్పట్లో ఏడాదికి ఒక్క సినిమా నిర్మించడమే కష్టం అనుకుంటున్నా సమయంలో.. ఒక్క ఏడాదిలోనే మూడు సినిమాలను నిర్మించి అందర్నీ ఆశ్చర్యపరిచారు రామోజీరావు ముఖ్యంగా అందులో రెండు సినిమాల సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా మయూరి ప్రతిఘటన వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా తెరకెక్కించి మంచి విజయాన్ని అందించాయి. రాజేంద్రప్రసాద్ చంద్రమోహన్ వంటి నటులు అప్పట్లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఎన్నో చిత్రాలలో నటించారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా కొన్నేళ్లు మలయాళం హిందీ వంటి భాషలలో కూడా నిర్మించడం మొదలుపెట్టింది. తెలుగులో తెరకెక్కించిన సినిమాలు ఇతర భాషలలో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాయి అలా.. చిత్రం, నువ్వే కావాలి ఆనందం వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. 2003లో ఒక హిందీ రెండు కన్నడ రెండు తెలుగు ఒక తమిళ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మించి రికార్డును కూడా అందుకుంది ఉషా కిరణ్ బ్యానర్. ఆ తర్వాత ఎన్నో కొత్త సంస్థలు టాలీవుడ్ కు పరిచయం కావడంతో ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థలు వేగవంతం తగ్గింది. చివరిగా 2015లో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూత దండాకోర్ సినిమాని నిర్మించారు. నువ్వే కావాలి సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది అలాగే ఎన్నో నంది అవార్డులు కూడా ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: