అమెరికాని షేక్ చేయనున్న కల్కి?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇది వరకెప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ మూవీలో ప్రభాస్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్, బుజ్జి గ్లింప్స్ ప్రేక్షకులను చాలా  ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే బుజ్జి, భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సిరీస్ కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. దీనితో మూవీ ఎలా ఉండబోతుంది? ఇంకా అందులో ప్రభాస్ పాత్ర అలాగే బుజ్జి రోబో పాత్ర ఎలా ఉంటుందో చూపించారు.కల్కి మూవీని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ బాగా పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ముంబై లో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. కల్కి సినిమా ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ మూవీ పై పోస్ట్ ను షేర్ చేశారు. కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది అని కల్కి పోస్టర్ ను షేర్ చేశారు ఈ మూవీ మేకర్స్.


ఇక ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది. ప్రభాస్ ఎలాంటి డైలాగ్స్ తో అదరగొడతారని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి దాకా విడుదలైన బుజ్జి గ్లింప్స్, యానిమేషన్ సిరీస్ చూస్తుంటే కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర మరీ అంత సీరియస్ గా ఉండదని అర్ధమవుతుంది. అంతకు ముందు వచ్చిన సలార్ మూవీలో ప్రభాస్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. డైలాగ్స్ కూడా పెద్దగా చెప్పకుండా ఫుల్ యాక్షన్ తోనే అదరగొట్టాడు డార్లింగ్. కానీ ఈ మూవీలో అలా కాదు అని యాక్షన్ తో పాటు ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకుంటాడని అర్ధమవుతుంది. ఇక కల్కి మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక బుజ్జి అనే రోబోకు కీర్తిసురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ సినిమా అమెరికాలో భారీ లెవెల్ లో రిలీజ్ కానుంది. అక్కడ ఎక్కువ IMAX థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కెనడాలో హిందీ వెర్షన్, USA లో తెలుగు వెర్షన్.. ఈ రెండు కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: