టాలీవుడ్ స్టార్ నుంచి "చార్మింగ్ స్టార్ "గా శర్వానంద్ నామకరణం..!!

murali krishna
టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 హీరోల్లో శర్వానంద్ ఒకడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శర్వానంద్.. ఆ తర్వాత హీరోగా నిలుదొక్కుకున్నాడు.గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, శతమానంభవతి వంటి చిత్రాలతో ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్ ను సంపాదించుకున్నాడు. యంగ్ హీరో శర్వానంద్.. ప్రస్తుతం టాలీవడ్ లో టాలెంటెడ్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఇక శర్వానంద్ పేరు వినగానే మొదట యూత్ అకట్టుకునే లవ్ మూవీస్, కుటుంబ కథా చిత్రాలు గుర్తుకు వస్తాయి.ఎందుకంటే.. శర్వానంద్ అటు యూత్ ను ఇటు ఫ్యామిలీని బాలేన్స్ చేసే ఎంటర్టైన్మెంట్ సినిమాల్లోనే ఎక్కువగా అలరించాడు. ఈ క్రమంలోనే ఈయనకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓవైపు యూత్ తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం చేరువయ్యాడు. సాఫ్ట్ కథలకే కాకుండా యాక్షన్ చిత్రాలకు కూడా చక్కగా యాప్ట్ అయ్యే హీరో శర్వానంద్. ఇదిలా ఉంటే.. తాజాగా శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టితో కలిసి 'మనమే' అనే ప్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రేపు అనగా శుక్రవారం జూన్ 7వ తేదిన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.యంగ్ హీరో శర్వానంద్, కృతిశెట్టి జంటగా 'మనమే' అనే సినిమాలో నటించారు. కాగా, ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరించారు. సపోర్టింగ్ రోల్స్లో కనిపించి నెమ్మదిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు టాలీవుడ్లోనే టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు శర్వానంద్. శర్వా సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేలా పేరు తెచ్చుకున్నాడు.మంచి స్టార్డమ్ సంపాదించుకున్నాడు. నేచురల్ యాక్టింగ్తో పక్కింటి కుర్రాడిగా కనిపించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఎన్నో హిట్లు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న శర్వాకు ఇప్పటి వరకు ఎటువంటి ట్యాగ్ లేదు. అయితే ఇకపై శర్వాను ఫ్యాన్స్ ఓ కొత్త టైటిల్తో పిలవనున్నారు. అదేంటంటే?తాజాగా తన కొత్త సినిమా ఈవెంట్‌లో తన బిరుదును ప్రకటించారు మేకర్స్.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఇందులో ‘మనమే’ నిర్మాత ఈ యంగ్ హీరోకు ఛార్మింగ్ స్టార్ అనే టైటిల్ ఇచ్చారు. సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ అదే వాడారట. ఇది విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: