"హేమ" అరెస్టు పై స్పందించిన "కుర్చీ తాత"..!!

murali krishna

సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మే 20న బెంగళూరులో రేవ్ పార్టీ విషయం బయటికి రాగానే అందులో హేమ కూడా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పార్టీలో హేమ కూడా ఉందని, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ స్వయంగా బెంగళూరు పోలీసులే వెల్లడించారు. అయినా కూడా ఈ విషయం బయటకు రాగానే హేమ తాను హైదరాబాద్లోనే ఉన్నానని.. ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓ వీడియో విడుదల చేసింది. కానీ, బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమె ఫోటోలు విడుదల చేయడంతో.. హేమ చేసినది ఫేక్ వీడియో అని తేలిపోయింది. అంతేకాదు ఆ మరసటి రోజు తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ వండుతున్న వీడియో షేర్ చేసింది.ఈ వీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇదంతా కావాలనే చేస్తుందని, హైదరాబాద్లోని ఇంట్లోనే ఉన్నానని చెప్పేందుకు డ్రామాలు చేస్తుందంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇక బెంగళూరు పోలీసులు తమ విచారణలో భాగంగా పార్టీకి హాజరైన అందరి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేయించారు. ఇందులో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్గా తేలింది. అలా పాజిటివ్ వచ్చిన వారు అందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే క్రమంలో నటి హేమకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి ఆమె అనారోగ్యం కారణంగా గైర్హాజరు కాగా.. ఇప్పుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు.
తాజాగా ఈ విషయం పై కుర్చీ తాత స్పందించారు.సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఓవర్ స్టార్స్‌గా మారిన వారితో కాలా పాషా ఒకరు. కుర్చీ మడతపెట్టి డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఈ డైలాగ్‌తో ఓ పాటను పెట్టేశారు.దీంతో కాలా పాషాకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. ఈ మూవీలో పాటను పెట్టినందుకు గానే తమన్ కొంత డబ్బు సాయం కూడా చేశాడు.అయితే అప్పటి నుంచి కాలా పాషాను కుర్చీ తాతగా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఆయన నిత్యం పలు విషయాలపై స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ అరెస్ట్ అవడంపై స్పందించాడు. ''రేవ్ పార్టీ అనేది భారతీయ సంస్కృతి కాదు. దానికి హాజరైన హే అడ్డంగా దొరికిపోయింది. చివరికి ఏమైంది అరెస్ట్ అయి జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుంది. రేవ్ పార్టీలకు వెళ్లి విచ్చలవిడిగా తిరగడం, డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఎందుకు అవసరమా.అందరూ అనుకున్నట్లు ఎంట్రీ టికెట్ లక్షల్లో ఉండదు రూ. 500 ఉంటుంది. లక్షల్లో ఎంట్రీ టికెట్ కోసం ఎవ్వడూ ఖర్చుపెట్టడు. రూ. 5 వేలు పడేస్తే గంజాయి కూడా ఇస్తారు. అలాగే రూ. 50 వేలకు ఇంజెక్షన్లు ఇస్తారు. నేను హైదరాబాద్‌లో ఇప్పిస్తాను. అబద్ధాలు చెప్పడానికి హద్దుండాలి. అయితే కొందరు హేమను ట్రోల్స్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు సాయం చేయాలి లేదా ఓ మూల కూర్చోవాలి అంతే కానీ నిజానిజాలు తెలియకుండా మాట్లాడుకూడదు'' అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: