త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న వైష్ణవి చైతన్య.. రివిల్ చేసిన హీరో..!

lakhmi saranya
బేబీ మూవీ తో హీరోయిన్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య.. మొట్టమొదటి చిత్రంతోనే భారీ సక్సెస్ ని అందుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలను దక్కించుకుని టాలీవుడ్ లో తనలైన ముద్ర వేసింది. దీంతో ఈ బ్యూటీ కి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా లవ్ మీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది వైష్ణవి. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు.
కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకొన్నంత ఫలితం దక్కించుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలో కి వచ్చేందుకు సిద్ధమయింది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా లవ్ మీ మూవీ టీం తో సుమా అడ్డ షోకు వెళ్ళింది వైష్ణవి చైతన్య. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు టీం. షోలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వైష్ణవి, ఆశిష్, రవి కృష్ణ సందడి చేశారు. ఇక అనంతరం హీరో ఆశిష్.. వైష్ణవి చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. " వైష్ణవి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది " అంటూ నోరు జారడు. అయితే.. ఈ గుడ్ న్యూస్ ఏంటో చెప్పక ముందే అడ్డుపడిన సుమ.. రీసెంట్ గా పెళ్లి అయింది నీకు.. గుడ్ న్యూస్ చెప్పాల్సింది నువ్వు కదా అని కౌంటర్ వేసింది.
ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే వైష్ణవి చైతన్య నోరు విప్పాల్సిందే. రౌడీ బాయ్స్ మూవీ తో టాలీవుడ్ కి ఏంట్రీ ఇచ్చిన ఆశిష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అనంతరం దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక లవ్ మీ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుందామని రెడీ అయ్యాడు. కానీ ఈ మూవీ అనుకున్న ఫలితం దక్కించుకోకపోవడంతో నిరాశకు గురయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: