అతనితో రొమాన్స్.. బాగా ఎంజాయ్ చేస్తా అంటున్న తమన్నా?

praveen
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే జూనియర్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ఒక ట్యాగ్ ను కూడా సొంతం చేసుకుంది. అయితే తమన్నా మొన్నటి వరకు అందాల ఆరబోత చేయడంలో.. కొన్ని లిమిట్స్ పెట్టుకునేది. హీరోలతో లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించేది కాదు. కానీ గత కొన్ని రోజుల క్రితమే అటు తన లిమిట్స్ ని చెరపేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించడానికి రెడీ అవుతుంది.

 ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో అటు తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో శృంగార సన్నివేశాలలో కూడా నటించడం అందరిని అవాక్కయ్యేలా చేసింది అన్న విషయం తెలిసిందే  ఇక రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పాత్రలు చేయబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది మిల్కీ బ్యూటీ. అయితే లస్ట్ స్టోరీస్ లో కలిసి నటించిన విజయ్ వర్మతో ప్రస్తుతం తమన్న పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ విషయాన్ని అధికారికంగానే ఒప్పుకుంది. ఇక త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

 అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. బోల్డ్ పాత్రలు చేస్తే తప్పేంటి అంటూ తమన్న కామెంట్స్ చేసింది  ఇప్పటివరకు తాను అలాగే అడల్ట్ కంటెంట్, బోల్డ్ సీన్లకు ఓకే చెప్పలేదని.. కానీ అవి కూడా సన్నివేశాలు మాత్రమే కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు కూడా స్టోరీ టెల్లింగ్ లో ఒక పార్ట్ అని తనకు అర్థమైంది. అందుకే ఇప్పుడు అలాంటి పాత్రలు చేయడానికి కూడా రెడీ అవుతున్న అంటూ తెలిపింది. లస్ట్ స్టోరీస్ 2 కోసం బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు.. తనకు భయం భయంగానే అనిపించిందని.. అయితే విజయ్ వర్మతో తనకు ఉన్న చనువు కారణంగా అతనితో రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేయగలిగాను అంటూ తమన్న చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: