బిగ్ బాస్ 8 తెలుగులో.. ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లే?

praveen
బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిన సెలెబ్రిటీల గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఇక ఈ బిగ్ బాస్ షో ద్వారా అవకాశముంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఇక బిగ్ బాస్ ఏ భాషలో ప్రసారమైన కూడా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి.

తెలుగులో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ఇదే రేంజ్ లో సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు ఏడు సీజన్స్ ని ఎంతో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే  ఈసారి బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్లోఎవరు కంటెస్టెంట్స్  గా హౌస్ లోకి వెళ్లబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈసారి బిగ్ బాస్ 8వ సీజన్లలోకి కంటెస్టెంట్స్ గా వెళ్లబోయే వీళ్లే అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది.

 ఎప్పుడు యూట్యూబర్  తీసుకు వచ్చినట్టు గానే ఈసారి బంచిక్ బబ్లూ ని తీసుకురాబోతున్నారట. హీరో రాజ్ తరుణ్, విరూపాక్ష సినిమా నటి సోనియా, నటి హేమ, మాజీ భార్యా భర్తలు అయినా నేత్ర, వంశీకృష్ణ బిగ్బాస్ హౌస్ లోకి రాబోతున్నారట.  వంశీకృష్ణ మోటివేషనల్ స్పీకర్ కావడం గమనార్హం. సోషల్ మీడియాలో బోల్డ్ పోస్టులతో హాట్ టాపిక్ గా మారి పోయే రీతు చౌదరి, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత. స్ట్రీట్ ఫుడ్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ, బర్రెలక్క, కుషిత కళ్ళపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, జబర్దస్త్ నరేష్, అమృత ప్రణయ్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: