దిల్ రాజ్ అంచనాల పై సందేహాలు !

Seetha Sailaja
టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురులో దిల్ రాజ్ ఒకరు అన్నది ఓపెన్ సీక్రెట్. ఒక రచయిత లేదా దర్శకుడు చెప్పిన కథ విషయంలో దిల్ రాజ్ జడ్జిమెంట్ చాల ఖచ్చితంగా ఉంటుంది అన్న పేరు ఈయనకు ఉంది. అయితే అలాంటి దిల్ రాజ్ తన సినిమాల జడ్జిమెంట్ విషయంలో పొరపాట్లు చేస్తున్నాడా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.

దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజ్ సంస్థ నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో చేస్తున్న పొరపాట్లు వల్ల దిల్ రాజ్ కు ప్రస్తుతం కాలం కలిసి రావడంలేదు అన్న అభిప్రాయం కొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రియల్ లో విడుదలైన విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ విజయం పై దిల్ రాజ్ పెట్టుకున్న అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.

వాస్తవానికి ఈ మూవీ కథను మొదట్లో విన్న దిల్ రాజ్ ఈమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంచనాలు పెంచాడు అనిఅంటారు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ పరాజయం చెందినప్పటికీ దిల్ రాజ్ ఏమాత్రం ఖంగారు పడకుండా లేటెస్ట్ గా విదలైన ‘లవ్ మీ’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ‘ఆర్య’ కథ విన్నప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ ‘లవ్ మీ’ కథ విన్నప్పుడు తనకు వచ్చింది అంటూ ఈ మూవీ పై అంచనాలు పెంచిన్నప్పటికీ కనీసం వీకెండ్ లో కూడ ఈమూవీ ధియేటర్లు ఖాళీగా ఉండటం చూసిన వారు దిల్ రాజ్ ఇలాంటి కథలను ఎందుకు ఎంచుకుంటున్నారు అంటూ ఆశ్చర్య పోతున్నారు.

ఇక భారీ సినిమాలు చిరునామగా ఉండే దిల్ రాజ్ మూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ‘గేమ్ ఛేంజర్ గా ఉండే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో దిల్ రాజ్ కు కూడ తెలియని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. అదేవిధంగా సమంత తో తీసిన ‘శాకుంతలం’ మూవీ కూడ కలిసి రాలేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: