పవన్ తో ప్రభాస్ మల్టీ స్టారర్ మూవీ..క్లారిటీ ఇచ్చిన ఓజి డైరెక్టర్..!!

murali krishna
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల మూవీ ల ట్రెండ్ ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బడాబడా పాన్ ఇండియా స్టార్స్ కూడా మల్టీ స్టార్లర్ మూవీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ బిగ్ బడా మల్టీస్టారర్ మూవీ రాబోతుంది అన్న ప్రచారం ఊపొందుకుంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ సుజిత్ చేసిన కామెంట్స్ అంటూ తెలుస్తుంది .టాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఇటీవల తిరిగి సెట్స్‌లో పాల్గొన్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తికేయ హీరోగా నటించిన భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేశాడు డైరెక్టర్ సుజిత్.ఇందులో కార్తికేయతో చిట్ చాట్ చేసిన సూజిత్ ఓజి అప్డేట్స్ అందించడంతోపాటు.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా మల్టీ స్టారర్ అంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వినడానికే ఓ సెన్సేషన్‌. అలాంటి ఇండస్ట్రీని షేక్ చేస్తే ఈ కాంబోలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించాలని అనుకుంటున్నాడట సుజిత్. ఇటీవల ఈ విషయాన్ని భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో వివరించాడు.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో కలిపి ఓ మల్టీ స్టారర్ చేయాలనేది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. భజే వాయు వేగం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా హీరో కార్తికేయ, దర్శకుడు సుజీత్ ను ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ‘ఓజీ’ మూవీతో పాటు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఓజీ’ ఫస్ట్ డే షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్ బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని తెలిసిపోయిందన్నారు.“‘ఓజీ’ ఫస్ట్ డే షూట్ చేసేటప్పుడు బాంబేలో ఉన్నాం. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాం. తొలి రోజే ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందని అర్థం అయ్యింది. ఆయనకు సినిమాలో చేయబోయే తర్వాత సీన్లు ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనం ఇచ్చే ఇన్ ఫుట్స్ ను బట్టే తను ఎలా చేయాలి అనేది 80 శాతం అర్థం చేసుకుంటారు. సీన్లు బాగా చదివి అర్థం చేసుకుంటారు. రెండో రోజు షూటింగ్ లో ఓ సీన్ చదివి చాలా ఎగ్జైట్ అయ్యారు. సీన్ బాగా చేయాలి అన్నారు. ఆ సినిమాకు ఆ సీన్ చాలా హెల్ప్ అయ్యింది” అని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ కల్యాణ్, ప్రభాస్ చాలా జెన్యూస్ పర్సన్స్ అని సుజీత్ చెప్పుకొచ్చారు. “పవన్ కల్యాణ్, ప్రభాస్ చాలా జెన్యూస్ పర్సన్స్. వాళ్లతో సినిమా చేస్తుంటే ఎలాంటి సమస్యలు రావు. వాళ్లతో ఇలా ఉండాలి. అలా ఉండాలి అనేలా ప్రవర్తించరు. వాళ్ల వర్క్ ఏదో వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోతారు. ప్రభాస్ చిన్న వారికి కూడా చాలా గౌరవం ఇస్తారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు. కొత్త విషయాలను తెలుసుకుంటాడు. ఆయనకు మనం చెప్పిన సీన్ నచ్చిందంటే అద్భుతంగా చేస్తారు” అని వెల్లడించారు."అది ఎంతవరకు ముందుకెళ్తుందో తెలియదు కానీ.. నేనైతే చాలా చాలా కష్టపడుతున్నాను ఆ మూవీ రావడానికి అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీ స్టారర్ వస్తే మాత్రం అది కెవ్వు కేక ..రచ్చరంబోలానే అంటూ పోగిడేస్తున్నారు . అంతేకాదు ఓజీ గురించి సుజిత్ మాట్లాడుతూ.." పవన్ కళ్యాణ్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపిస్తారు అని .. ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడని సరికొత్త గెటప్ లో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారు అని చెప్పుకొచ్చారు". ప్రభాస్ - పవన్ కళ్యాణ్ లపై చేసిన సుజిత్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: