"సత్యభామ" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మొన్నటి వరకు మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మూవీ బృందం ఫుల్ జోరుగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో సాగిస్తూ ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని అసలు మార్చదు అని ఎంతో మంది జనాలు అనుకున్నారు.
 

 కానీ సడన్ గా ఈ సినిమా బృందం ఎలాంటి వార్త లేకుండా ఈ మూవీ యొక్క విడుదల తేదీని మార్చేసింది. ఈ సినిమాను మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక బాలకృష్ణ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేశారు. ఈ సినిమా నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: