ఈసారి నన్ను వదిలేసారు... బెంగళూరు రేవ్ పార్టీ పై స్పందించిన నవదీప్..!

lakhmi saranya
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉండడంతో ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పార్టీలో హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, నటి హేమ, ఆషిక పలువురు నటీనటులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై కొందరు స్పందించి తాము అసలు ఆ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ బెంగళూరు రేవ్ పార్టీకి నటి హేమ వెళ్లినట్లు ఆధారాలు బయటికి వచ్చాయి. ఫ్లైట్ టికెట్స్ మరియు ఆమె రక్త నమూనాలు  రేవ్‌ పార్టీకి వెళ్లినట్లు నిర్ధారించాయి. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కానీ హేమా మాత్రం నాకు రేవ్ పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు అంటూ కవర్ చేస్తూ వస్తుంది. ఇక ఈ క్రమంలో కొందరు ప్రేక్షకులు టాలీవుడ్ హీరో నవదీప్ ను పలు రకాలు ప్రశ్నలు అడిగారు.
బెంగళూరు రేవ్ పార్టీలో నువ్వు ఉన్నట్లు వార్తలు రాలేదని వెల్లడించారు. ఇక తాజాగా మౌళి ప్రమోషన్స్లో పాల్గొన్న నవదీప్తాను రేవ్ పార్టీ కి వెళ్లినట్లు వార్తలు రాలేదనే విషయంపై స్పందిస్తూ షాపింగ్ కామెంట్స్ చేశారు. " నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు వార్తలు రాకపోవడం వల్ల చాలామంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే ఎక్కడ రేవ్ పార్టీ, డ్రగ్స్ తీసుకున్నారన్న కేసుల్లో నేను ఉన్నానని ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఈసారి నన్ను వదిలేసారు. అయినా నాకు మంచే జరిగింది. రేవ్ పార్టీ అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది " అంటూ వెల్లడించారు నవదీప్. ప్రజెంట్ నవదీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: