అబ్బో పూజా హెగ్డే నక్క తోక తొక్కిందిగా.. మళ్ళీ ఐరన్ లెగ్ అవ్వదుగా?

Purushottham Vinay
నాగ చైతన్య హీరోగా చేసిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తారు విజయాన్ని నమోదు చేసింది.ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద మూవీతో ప్లాప్ అందుకుంది. అయితే ఆ సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులను పొందుకుంది. ఆ తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో అల్లు అర్జున్ సరసన బోల్డ్ గా నటించింది పూజ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తారు విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత రంగస్థలం సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి పాపులర్ అయ్యింది.ఇక అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆర్ ఆర్ ఆర్ కి ముందు ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఈ సినిమా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన అరవింద అనే పాత్రలో కనిపించింది పూజ. ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత మళ్లీ హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దల కొండ గణేష్ అనే సినిమా కూడా చేసింది. ఈ సినిమా కూడా  హిట్ అయింది.2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అలవైకుంఠపురం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని నమోదు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజ  బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టి బాలీవుడ్ లో బాగా అవకాశాలు అందుకుంది.


 అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించింది పూజ. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. అఖిల్ కి కూడా ఇదే ఫస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఎందుకో ఏమో గాని పూజ హెగ్డే అంటే జనాలకి బోర్ కొట్టేసింది. ప్రతి మూవీలో ఓవర్ యాక్షన్, చెత్త వాయిస్, చెత్త ఆటిట్యూడ్ జనాలకు నచ్చలేక ఆమెను తెగ ట్రోల్ చేసేవారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత విజయ్ సరసన చేసిన బీస్ట్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయింది. వరుసగా ఇన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంలో పూజ చెత్త యాక్టింగ్ కూడా ఒక కారణమే. పూజను ఐరన్ లెగ్ అంటూ తెగ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.సినిమా అవకాశాలు లేక అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయిన పూజ హెగ్డే ఇప్పుడు నక్క తోక తొక్కింది.ప్రస్తుతం తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44వ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే కనిపించనుంది. అయితే ఈ సినిమాతో పూజకి బ్రేక్ వస్తుందని నమ్ముతుంది. ఈ మూవీ హిట్ అయితే పూజకి ఉన్న ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: