"హనుమాన్ జంక్షన్" కి ముందనుకున్న ఇద్దరు హీరోలు ఎవరు... వారు ఎందుకు తప్పుకున్నారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న సినిమాలలో హనుమాన్ జంక్షన్ మూవీ ఒకటి. ఈ సినిమాలో జగపతి బాబు , అర్జున్ ప్రధాన పాత్రలలో నటించగా ... మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో మొదట జగపతి బాబు , అర్జున్ ను కాకుండా వేరే ఇద్దరు హీరోలను అనుకున్నారు. ఆల్మోస్ట్ ఆ ఇద్దరు హీరోలు ఫైనల్ అయ్యారు. వారికి అడ్వాన్సులు కూడా ఇచ్చారు.

కానీ చివరి నిమిషంలో వారిని తప్పించి జగపతి బాబు , అర్జున్ ను పెట్టుకున్నారు. అలా ఎందుకు జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. హనుమాన్ జంక్షన్ ఒక మలయాళ మూవీ కి అధికారిక రీమేక్. ఇక మలయాళం లో సూపర్ హిట్ విజయం అందుకున్న ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నారు. ఇ

క మోహన్ రాజా ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రలు ఉన్నాయి అందు వలన ఇద్దరు మంచి నటులు అయి ఉండాలి అలాగే వారిద్దరి మధ్య మంచి సన్నిహిత్యం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో నాలుగు నెలల పాటు నటీనటులనే ఎంపిక చేశారట. అందులో భాగంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు అయినటువంటి ఇద్దరు నటుల కోసం మోహన్ బాబు , రాజశేఖర్ లను మూవీ బృందం ఎంచుకుందట. అందులో భాగంగా వీరిద్దరికి అడ్వాన్సులు కూడా ఇచ్చారట.

కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే సమయానికి వీరిద్దరికీ సెట్ కావడం కష్టం , దానితో వీరిద్దరి మధ్య విభేదాలు వస్తే సినిమా షూటింగ్ కి ఏమైనా ప్రమాదం అనే ఉద్దేశంతో వీరిని కాకుండా వేరే వాళ్లతో వెళ్దాము అని ఆ తర్వాత జగపతి బాబు ,  అర్జున్ ను సంప్రదించడం , వారు ఓకే చెప్పడం అలా సాఫీగా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం జరిగింది. అలా మోహన్ బాబు , రాజశేఖర్ అనుకున్న పాత్రలలో జగపతి బాబు , అర్జున్ వచ్చారు. ఈ మూవీ వీరిద్దరి కెరియర్ లో మంచి సినిమాగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: