"ఇండియన్ 2" నార్త్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
లోక నాయకుడు కమల్ హాసన్ కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ విజయంతో మళ్ళీ తిరిగి కమల్ హాసన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక తాజాగా కమల్ హాసన్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన "ఇండియన్ 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే "ఇండియన్ 2" మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను జూలై 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా హక్కులను మేకర్స్ అమ్మివేశారు. ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులను పెన్ స్టూడియో సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక పెన్ స్టూడియో సంస్థ వారు ఈ సినిమాను నార్త్ ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే ప్రణాళికలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: