"మనమే" రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారి లో శర్వా నంద్ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు . ఇక పోతే హీరో గా అద్భుతమైన రీతిలో సక్సెస్ అయిన ఈయన కొన్ని సంవత్సరా ల పాటు వరస ఆపజాయలను ఎదురు కున్నాడు.
 

అలా వరుస అపజాయలు వస్తున్న సమయం లోనే ఈయన కొంత కాలం క్రితం ఒకే ఒక జీవితం అనే మూవీ తో తిరిగి మంచి విజయాన్ని అందుకొని కం బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ నటుడు మనమే అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.

ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా యొక్క ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా శర్వానంద్ కు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో తెలియాలి అంటే జూన్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: