అరణ్మనై 4: 100 కోట్లతో కోలీవుడ్ ని ఆదుకున్న రొట్ట సినిమా?

Purushottham Vinay
ఈ ఏడాది మాత్రం కోలీవుడ్ బాక్స్ ఆఫీసు ఒక్క 100 కోట్ల మూవీని కూడా చూడలేదని ఫ్యాన్స్ బాధ పడుతున్న క్రమంలో మొత్తానికి ఆ లోటును అరణ్మనై 4 క్లీన్ హిట్ తో తీర్చేసింది.కోలీవుడ్ లో గత ఏడాది జరిగిన మ్యాజిక్ ఈ ఏడాది జనవరిలో కూడా జరుగుతుందని భావించి శివకార్తికేయన్ నటించిన అయాలన్, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వంటి మూవీస్ ఈ సంవత్సరం పొంగల్‌కు విడుదలయ్యాయి. అయితే రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి మొదలైన బ్యాడ్ లక్ తమిళ తంబీలకు ఇప్పటిదాకా అంతే కొనసాగింది.సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్మనై 4 మూవీకి విశేష స్పందన లభించడంతో పాటు పలు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ 100 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 2024లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ చిత్రంగా కూడా ఈ సినిమా నిలిచింది.మే 3 వ తేదీన విడుదలైన ఈ సినిమాలో సుందర్ సితో పాటు రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో యోగి బాబు, కోవై సరళ, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ మూవీ బాక్ పేరుతో విడుదల అయ్యింది.


అయితే టాలీవుడ్ ప్రేక్షకులని ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.కారణం ఇదొక రొటీన్ రొట్ట కథ. కానీ ఇదే ఇప్పుడు కోలీవుడ్ ని నిలబెట్టింది.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ దాదాపు రెట్టింపు లాభాలను వసూలు చేయడంతో మేకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆదరణ పొందడంతో పాటు కలెక్షన్లలో కూడా ఈ మూవీ రికార్డు సృష్టిస్తోంది. 2024లో 100 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ మూవీగా ఘనత సాధించింది. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాత అవనీ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. తమిళంలో రూ. 56.50 కోట్లు, తెలుగులో రూ. 5.50 కోట్లు సహా దేశీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 63 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ 16 కోట్లు. ఇప్పుడు మొత్తంగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన అయాలాన్ లైఫ్ టైమ్ కలెక్షన్ 76.50 కోట్లు. ఈ సంవత్సరం తమిళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమా ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: