బుల్లితెరపై ఆ తేదీన.. ఆ సమయానికి ప్రసారం కానున్న పార్కింగ్..!

Pulgam Srinivas
హరీష్ కళ్యాణ్ హీరోగా , బిగిల్ ఫేమ్ ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్ గా , డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం లో తమిళ్ లో పార్కింగ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ భాషలో థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది . ఇక పోతే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇలా తెలుగు లో ఓ టీ టీ లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ శనివారం రోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.

మరి ఇప్పటికే థియేటర్ మరియు ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో సూపర్ గా సక్సెస్ అయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎం ఎస్ భాస్కర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ మరియు సోల్జర్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా భారీ సెట్టింగ్ లు , భారీ తార గానం లేకుండా ఒక చిన్న స్టోరీ లైన్ ను తీసుకొని దాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు సూపర్ గా సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను దర్శకుడికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: