టీమిండియాకు.. ముగ్గురు కోచ్ లు అవసరం లేదు?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో సరికొత్త ట్రెండు కొనసాగుతుంది. ఇక ఈ ట్రెండ్ నే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఫాలో అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్రికెట్లోని మూడు ఫార్మాట్లకు కూడా ఒకే ఒక్క కెప్టెన్ ఉండేవాడు  ఇక ప్రతి ఫార్మాట్లో ఆ ఆటగాడే సారధిగా జట్టును ముందుకు నడిపించేవాడు   అదే సమయంలో ఇక మూడు ఫార్మాట్లకు కలిపి ఒకే హెడ్ కోచ్ ఉండేవాడు అన్న విషయం తెలిసిందే  కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ కనుమరుగు  అయింది. ఎందుకంటే ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ముగ్గురుకెప్టెన్లను నియమిస్తున్నాయ్ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. కేవలం కెప్టెన్లను మాత్రమే కాదు ఏకంగా కోచ్ ల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

 ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ట్రెండ్ ఫాలో అవుతున్నాయి అని చెప్పాలి. కానీ అటు వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ మాత్రం ఇంకా ఈ ట్రెండుకు అలవాటు పడలేదు. ఇప్పటికి కూడా భారత జట్టులో మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అదే సమయంలో ఇక మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడు ఉన్నాడు. అయితే రానున్న రోజుల్లో భారత జట్టు కూడా  మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ లను నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ.. అది కార్యరూపం మాత్రం దాల్చడం లేదు.

 అయితే ఇదే విషయం గురించి ఇంగ్లాండు మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఇతర జట్ల తరహాలో టీమ్ ఇండియాకు ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కోచ్ అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.  భారత క్రికెటర్లు ఇతర దేశాల లీగ్స్ లో ఆడరు. కాబట్టి వారికి ఇలాంటి విధానాలు అవసరం లేదు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని లీగ్స్ లలో కూడా ఆడుతూ ఉంటారు. కానీ భారత ఆటగాళ్లకు ఆ బాధ లేదు. అందుకే ఇక ఆ జట్టుకు మూడు ఫార్మాట్ లో కలిపి ఒక సమర్థవంతమైన కోచ్ ఉంటే సరిపోతుంది అంటూ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: