హాట్ టాపిక్ గా మారిన దానయ్య సేఫ్ గేమ్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీరాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని పేరును తెచ్చిపెడితే ఆమూవీని నిర్మించిన డివివి దానయ్యకు మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో నిర్మాతగా గుర్తింపుని ఇవ్వలేదు అన్న అభిప్రాయం చాలమందిలో ఉంది. మెగా కుటుంబానికి సన్నిహితుడైన దానయ్య ప్రస్తుతం నాని తో ‘సరిపోదా శనివారం’ పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ’ లాంటి భారీ సినిమాలను తీస్తున్నాడు.

ఇండస్ట్రీలో వివాదాలకు చాల దూరంగా ఉండే దానయ్యకు ‘ఆర్ ఆర్ ఆర్’ సరైన గుర్తింపు ఇవ్వలేక పోయింది అని కొందరి అభిప్రాయం. ఇండస్ట్రీ లోని చాలమంది ప్రముఖ నిర్మాతలు వరసపెట్టి సినిమాలు తీస్తుంటే దానయ్య మాత్రం సెలెక్టివ్ గా సినిమాలను తీస్తున్నాడు. వాస్తవానికి దానయ్య వదులుకున్న ప్రోజెక్టుల గురించి ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద చర్చే జరుగుతోంది.

తమిళ స్టార్ హీరో విజయ్ తో ఒక భారీ సినిమాను చేసే అవకాశం  దానయ్య కు  వచ్చిన ఈమూవీ భారీ బడ్జెట్ రీత్యా ఆమూవీని చేసే అవకాశం దానయ్య వదులుకున్నాడు అన్న గాసిప్పులు ఉన్నాయి. ఈసినిమాలో నటించేందుకు విజయ్ 2 వందల కోట్లు భారీ పారితోషికం విజయ్ డిమాండ్ చేయడంతో ఆ స్థాయిలో ఆమూవీ పై పెట్టుబడి పెట్టడం మంచిదికాదు అన్న అభిప్రాయంతో దానయ్య ఆ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు అన్న గాసిప్పులు ఉన్నాయి.


అదేవిధంగా నాని సుజిత్ కలయికలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన మూవీని సైతం వేరే ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చేందుకుదానయ్య చర్చలు జరపుతున్నాడు అంటూ గాసిప్పులు. అంతే కాదు  అదేవిధంగా ప్రభాస్ తో షూటింగ్ దశలో ఉన్న ‘రాజా సాబ్’ మూవీ కూడ ముందు  దానయ్య  ప్రొడక్షన్ హౌస్ కు వచ్చి ఆతరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకు వెళ్ళింది అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. దీనితో సినిమాల నిర్మాణ విషయంలో డివివి దానయ్య అనుస రిస్తున్న  సేఫ్ గేమ్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది అంటూ కొందరు కామెంట్స్ ఛేస్తున్నారు..      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: