సుధీర్ బాబు తెలివైన పని !

Seetha Sailaja
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా ప్రిన్స్ మహేష్ బాబు బావగా మహేష్ అభిమానులకు సూపరిచితుడైన సుధీర్ బాబు నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఇప్పటికీ హీరోగా పూర్తిగా అతడు నిలదొక్కుకోలేకపోతున్నాడు. మొదట్లో ఒకటి రెండు హిట్ సినిమాలు అతడికి వచ్చినప్పటికీ ఆతరువాత అతడి సినిమాలు చాల వరకు ఫ్లాప్ అవ్వడంతో అతడి సినిమాలకు బిజినెస్ పరంగా చాల సమస్యలు ఏర్పడ్డాయి అంటారు.

గత కొంత కాలంగా వరస ఫ్లాప్ లు అతడిని వెంటాడుతూ ఉండటంతో అతడి కెరియర్ మరింత సమస్యలలో పడిపోయింది. దీనితో లేటెస్ట్ గా విడుదల కాబోతున్న ‘హరోంహర’ మూవీ పై సుధీర్ బాబు చాల ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈమూవీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31న విడుదల కావలసి ఉంది. అయితే ఆరోజు అంచనాలు బాగా ఉన్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ కాజల్ ‘సత్యభామ’ కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ మూవీని జూన్ 14వ తారీఖుకు వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే సుధీర్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం మంచిది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జూన్ 4వ తారీఖున తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ ఫలితాల పై తెలుగు రాష్ట్రాలలో వందల కోట్లల్లో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ప్రజల దృష్టి అంతా ఎన్నికల ఫలితాల పైనే ఉంటుంది.

ఇలాంటి హడావిడి మధ్య సుధీర్ బాబు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి సుధీర్ బాబు తెలివిగా ఈ నిర్ణయం తీసుకునీ తన సినిమాను జూన్ రెండవ వారానికి వాయిదా వేసి ఉంటాడు అంటూ కొందరి అభిప్రాయపడుతున్నారు. దీనితో ఈ నిర్ణయం తీసుకున్న సుధీర్ బాబు సమాయస్పూర్తిని మెచ్చుకోవాలి అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: