మోదీ క్యారెక్టర్ లో సత్యరాజ్... ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సత్యరాజ్..!

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగించిన సత్యరాజ్ ప్రస్తుతం సీనియర్ పాత్రలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి మూవీ లో ప్రభాస్ కి తండ్రి పాత్రలో నటించి సత్యరాజ్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లలో కట్టప్ప పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు.

ఇక అప్పటి నుండి ఈయనకు ఇండియా లోని అనేక భాషల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఈయన ఫుల్ బిజీ నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈయనకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఓ ప్రముఖ సంస్థ ప్రస్తుత భారత ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ను మూవీ ల తెరకెక్కించాలి అని భావిస్తున్నట్లు , అందులో భాగంగా నరేంద్ర మోడీ పాత్ర కోసం సత్యరాజ్ ను సంప్రదించినట్లు ఈయన కూడా నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందిపోయే సినిమాలో మోడీ పాత్ర చేసేందుకు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలపై తాజాగా సత్యరాజ్ స్పందించాడు. తాజాగా ఓ తమిళ న్యూస్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సత్యరాజ్ మాట్లాడుతూ ... తాను కూడా ఈ వార్త చూశాను అని , అయితే ఈ విషయంలో ఎవరూ తనను ఇప్పటి వరకు సంప్రదించలేదు అని సత్యరాజ్ స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sr

సంబంధిత వార్తలు: