అఫిషియల్ : "ఇండియన్ 2" ఆడియో లాంచ్ తేదీ ఖరారు..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ్ కీలక పాత్రలలో దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో "ఇండియన్ 2" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఆ తేదీ వరకు పూర్తి కావు అనే నేపథ్యంలో ఈ సినిమాను జూన్ లో విడుదల చేయకుండా జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.
 

ఇక ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించిన రోజే ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ ను కూడా మే 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటించారు. చెప్పిన విధంగానే ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకునే విధంగా ఉంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ వేడుకను భారీ ఎత్తున చెన్నై లో చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ వేడుకను ఎక్కడ చేయబోతున్నారో చెప్పలేదు కానీ ఏ తేదీన చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పారు. ఈ మూవీ యొక్క ఆడియో వేడుకను జూన్ 1 వ తేదీన నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆడియో లాంచ్ ను అత్యంత గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: