అఫీషియల్ : రాజు యాదవ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శీను తాజాగా రాజు యాదవ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మే 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం వారు విడుదల చేశారు.
 

ఈ ట్రైలర్ ను బట్టి ఈ సినిమా కథ ఆల్మోస్ట్ అర్థం అయింది. ఈ సినిమా ట్రైలర్ ప్రకారం క్రికెట్ ఆట ఆడుతుండగా గెటప్ శీను మూతికి బంతి తగిలి గాయం అవుతుంది. దానితో వెంటనే అతన్ని హాస్పటల్ తీసుకువెళ్లగా అతనికి ఒక ఆపరేషన్ చేయాలి దానికి డబ్బు బాగా ఖర్చు అవుతుంది లేకపోతే అతని ముఖం ఎప్పుడు నవ్వుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది అని డాక్టర్లు చెబుతారు. దానితో శీను ఆపరేషన్ చేయించమని ఇంట్లో వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. వారు మాత్రం డబ్బులు లేవు , ఇంట్లో ఒక అమ్మాయి ఉంది పెళ్లికి డబ్బులు కావాలి అని అంటూ ఉంటారు.

ఇక ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడడం , ఇంట్లో గొడవలు జరగడం దాని ద్వారా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండడం ఇలా ట్రైలర్ లో ఇవన్నీ చూపించారు. ఈ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: