మరో మూవీతో రెడీ అయిపోయిన విజయ్ ఆంటోనీ..!

MADDIBOINA AJAY KUMAR
వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న తమిళ హీరోలలో విజయ్ ఆంటోనీ ఒకరు . ఈయన ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన బిచ్చగాడు 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . బిచ్చగాడు మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . ఇక ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత ఈయన హత్య అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈయన లవ్ గురు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
 

ఈ మూవీ కి డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బారి కలెక్షన్ లను ఈ మూవీ వసూలు చేయలేకపోయింది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ నటుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం ఈ నటుడు తుఫాన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

దీనికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క టీజర్ ను మే 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ టీజర్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Va

సంబంధిత వార్తలు: