ఆ విషయం వినగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది... అల్లు అర్జున్..!

MADDIBOINA AJAY KUMAR
తాజాగా తెలుగు సినీ పరిశ్రమ లో దర్శకుల దినోత్సవం జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి ని పురస్కరిం చుకొని తెలుగు సినిమా దర్శకులు అందరూ కలిసి దర్శకుల దినోత్సవం వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు . ఇక ఈ వేడుక కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు . ఈ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ... సినిమా పనులతో ఎప్పుడు బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడిపే దర్శకులు అంతా కలిసి ఇలా ఓ దర్శకుల దినోత్సవం రోజున జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 

ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు ఇంతే ఆనందం గా సంతోషం గా ఈ వేడుకను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అల్లు అర్జున్ అన్నారు . ఈ స్ఫూర్తి తో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌ల లోని వివిధ విభాగాలు కూడా ముందు కొచ్చి వేడుకలు నిర్వహించు కోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి ని పురస్కరించుకొని దర్శకులు దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పుడు తనకెంతో సంతోషం కలిగింది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా ఈ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ అనేక విషయాలను మాట్లాడారు.

ఈ సందర్భం గా దాసరి తో తమకున్న అనుభవాన్ని , సంబంధాన్ని కూడా అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు . ఈ వేడుక లో దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి అనిల్‌ రావిపూడి , శ్రీరామ్‌ ఆదిత్య , శైలేష్‌ కొలను లాంటి యువ దర్శకులు తమ స్టెప్పు లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: