మే నెలలో రిలీజ్ కి రెడీగా ఉన్నా తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమకు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల చాలా డల్ గానే సాగింది. పోయిన నెల చివరన విడుదల అయినటువంటి టిల్లు స్క్వేర్ మూవీనే ఈ నెల కూడా వసూళ్లను రాబట్టింది. మంచి అంచనాలతో ఏప్రిల్ నెలలో విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి మే నెలలో ఏ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ నెల ప్రారంభం అయిన తర్వాత మే 3 వ తేదీన చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మే 3 వ తేదీన అల్లరి నరేష్ హీరో గా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు , సుహాస్ నటించిన ప్రసన్న వదనం , వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన శబరి మూవీ లు విడుదల కానున్నాయి. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమాలు ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో చూడాలి. ఇక ఆ తర్వాత మే 10 వ తేదీన సత్య దేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలాగే మే నెలలో విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రూపొందిన సత్యభామ , దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందిన లవ్ మీ , సుధీర్ బాబు హీరోగా రూపొందిన హరోం హర సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా మే నెలలో చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఏ మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: