కోట్ల రూపాయలు వారికోసం ఖర్చు చేస్తున్న మహేష్ బాబు...!!

murali krishna
మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల్లో ఒకరు.ప్రస్తుతం మహేష్ బాబు రెండు సంవత్సరాలకు ఒక సినిమా లో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు. రాజమౌళి  సినిమాకు మాత్రం డేట్స్ విషయంలో మహేష్ ఎలాంటి షరతులు విధించలేదని తెలుస్తోంది.మహేష్ బాబు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి యాడ్స్ కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే.కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు యాడ్స్ కోసం ఊహించని స్థాయి లో రెమ్యునరేషన్ ను అందుకున్నారు. అయితే యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం 30 శాతం చిన్నారులు, పేదలు, వృద్ధుల అవసరాల కోసం మహేష్ బాబు ఖర్చు చేస్తున్నారు. అలా చేయడం అంటే సాధారణ విషయం కాదని చెప్పాలి.టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ బాబు రూట్ సపరేట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.తాజాగా ఈ ఏఎంబి సినిమాస్ కి సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగింది.

ఇకపోతే ఏ ఎం బి సినిమాస్ కి మహేష్ బాబు పేరు ఉన్న అక్కడ నమ్రత పేరు పై బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం.. మొత్తంగా బెంగళూరు లో మరో కొత్త బిజినెస్ ని మహేష్ దంపతులు ప్రారంభించబోతున్నారు.ఇలా అన్ని రంగాల లో కూడా భారీ లాభాలను పొందుతున్న వీరిద్దరి వార్షికాదాయం రూ.400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.మహేష్ కూతురు సితార కూడా ఇలాంటి విషయంలో తండ్రిని తీసిపోలేదనే చెప్పాలి.ఈ క్రమంలో సితార తన మొదటి యాడ్ షూటింగ్ కి కోట్లల్లో వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని చారిటీ చేసేసింది. పేద పిల్లల విషయం లో చిన్న వయసులోనే సితార అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటది. అందరితో కలిసి పోయే మంచి మనస్తత్వం కలిగిన సితార సోషల్ మీడియా లో పలు పాటలకు డాన్స్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: