"ఓటిటి" ఎంట్రీ కి రెడీ అయిన "కోటబొమ్మాలి పిఎస్" ఒరిజినల్ వెర్షన్..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని రోజుల క్రితం శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమా తెలుగులో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా నాయట్టు అనే మలయాళ సూపర్ హిట్ మూవీ కి రీమేక్ గా రూపొందింది. ఇప్పటికే మలయాళం లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.
 

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. నాయట్టు మలయాళ ఒరిజినల్ వర్షన్ తెలుగు డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను తెలుగులో "చుండూరు పోలీస్ స్టేషన్" అనే టైటిల్ తో ఏప్రిల్ 26 వ తేదీ నుండి స్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ  ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. దానితో చుండూరు పోలీస్ స్టేషన్ సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో ఆదరణ దక్కడం కష్టమే అవుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే నాయట్టు సినిమాను తెలుగులో తేజ మార్ని రీమిక్ చేశాడు. ఈయన ఈ సినిమా ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ను ఏ మాత్రం పోగొట్టకుండా తెలుగు వారికి నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: