పాన్ ఇండియా డైరెక్టర్ తో కన్ఫామ్ అయిన విజయ్ మూవీ..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం మాత్రం వరుస అపజాయలను ఎదుర్కొంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయాడు. ఈయన పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , టాక్సీవాలా , గీత గోవిందం విజయాలతో తెలుగులో ఒక్క సారిగా క్రేజీ ను పెంచుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న దర్శకుల నుండి ఆఫర్లు వచ్చాయి. ఆయన కూడా వాటిని చేశాడు. అందులో భాగంగా ఈయన కొంత కాలం క్రితం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు.

మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొంది. ఇక అంతకంటే ముందు కూడా ఈయనకు రెండు మూడు పరాజయాలు దక్కాయి. ఇక లైగర్ మూవీ తర్వాత ఈయన నటించిన ఖుషి , ది ఫ్యామిలీ స్టార్ మూవీ లో కూడా ఈయనకు ఇలాంటి అనుభవాన్ని మిగులుతాయి. ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన ఈయనకు ఓ పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో హీరోగా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కేజిఎఫ్ సిరీస్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ తాజాగా విజయ్ మేనేజర్ ను కలిసినట్లు , విజయ్ తో సినిమా గురించి సంప్రదించినట్లు ఆల్మోస్ట్ వీరి కాంబోలో సినిమా ఓకే అయినట్లు మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త కనుక నిజం అయితే విజయ్ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడి సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: