"గేమ్ చేంజర్" కి చరణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి దేశంలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా కోసం చరణ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఏకంగా చరణ్ 120 కోట్ల భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. చరణ్ ఈ మూవీ కోసం భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో కొంత మంది చరణ్ కి ఈ స్థాయి రెమ్యూనరేషన్ అయితే సినిమా బడ్జెట్ ఆకాశానికి అంటి ఉంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొంత మంది చరణ్ అభిమానులు మాత్రం ఆయనకు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉంది.

సినిమాకు గనక కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఆయన క్రేజ్ తోనే సినిమా అవలీలగా 500 కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుంది. అంతటి క్రేజ్ ఉన్న హీరోకు 120 కోట్ల రెమ్యూనిరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి మాత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: