100 కోట్ల వైపు దూసుకెళ్తున్న మరో మల్లు సినిమా?

Purushottham Vinay
తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమలు తరువాత ప్రస్తుతం సౌత్ లో మలయాళ సినిమా రైజ్ బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు మలయాళ సినిమాలు అసలు 50 కోట్లు వసూళ్లు చేయడమే గగనం అనిపించేది.కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా వంద, రెండు వందల కోట్లు మార్క్ ని కూడా ఈజీగా క్రాస్ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అప్పుడెప్పుడో పులి మురుగన్ తరువాత లూసిఫర్,  2018 మూవీతో స్టార్ట్ అయిన ఈ రైజ్.. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం ది గోట్ లైఫ్ వంటి సినిమాలు 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి. మంజుమ్మల్ బాయ్స్ అయితే ఏకంగా 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే ఆడు జీవితం 150 కోట్ల మార్క్ ని అందుకుంది.ఇక తాజాగా మరో మలయాళమూవీ సినిమా కూడా 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. పుష్ప మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన 'ఆవేశం' సినిమా.. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆవేశాన్ని చూపిస్తూ దూసుకు వెళ్తుంది. మార్చి 11న రిలీజైన ఈ సినిమా  ఇప్పటి దాకా 80 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా థియేటర్స్ వద్ద ఆడియన్స్ జోష్ చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని దాటేసేలా కనిపిస్తుంది.

 
ఈ సినిమా 100 కోట్ల మార్క్ క్రాస్ చేస్తే ఫహాద్ ఫాజిల్ కి మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్.. ఈ మూవీని బాలయ్య రీమేక్ చేస్తే చాలా బాగుటుందని చెబుతున్నారు. యాక్షన్ కామెడీతో వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యింది. ఈ మూవీలోని హీరో పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పాత్రలో ఫహాద్ జీవించేశాడు.ఇక ఈ పాత్ర చూసిన తెలుగు ఆడియన్స్‌కి.. పైసా వసూల్ మూవీలో బాలయ్య పోషించిన తేడాసింగ్ గుర్తుకు వస్తున్నాడు. పైసా వసూల్ సినిమా హిట్ అవ్వకపోయినా.. తేడాసింగ్ పాత్ర మాత్రం ఆడియన్స్ కి బాగా బాగా అయ్యింది. ఇప్పుడు ఆవేశం సినిమాలోని పాత్ర కొంచెం అలాగే ఉండడంతో.. ఈ హిట్ మూవీని బాలయ్య రీమేక్ చేస్తే బాగుటుందని ఆశ పడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి ఆడియన్స్ కోరిక బాలయ్య తీరుస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: