"కల్కి" నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలకు దర్శకత్వం వహించి రెండు మూవీ లతో కూడా అద్భుతమైన విజయాలను అందుకొని ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకొనే , దిశ పాటని ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు అమితా బచ్చన్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ రోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఒక అప్డేట్ తో ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబో లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కొంత కాలం క్రితమే సలార్ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ తో పాటు రాజా సాబ్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: