సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో ఒక సంవత్సరం పూర్తి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులతో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో చాలా మూవీ లు మంచి విజయాలను సాధించాయి. ఇకపోతే ఈయన కెరియర్ మంచి జోష్ లో ముందుకు సాగుతున్న సమయం లోనే సాయి తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరిగింది. బైక్ యాక్సిడెంట్ కారణంగా ఈయన కొంత కాలం పాటు హాస్పటల్ లో వైద్యుల ఆధ్వర్యంలో ఉన్నాడు. ఆ తర్వాత ఈయన కోల్పోవడంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక కూడా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్నాడు.
 

అలా చాలా కాలం పాటు యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఆ తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని సాయి తేజ్ , సంయుక్త మీనన్ నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను  తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా ఈ రోజుతో ఒక సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అద్భుతమైన "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sdt

సంబంధిత వార్తలు: